విశాఖ ఘటనపై సంస్థ ఛైర్మన్‌ క్షమాపణ

తాజా వార్తలు

Updated : 20/05/2020 20:04 IST

విశాఖ ఘటనపై సంస్థ ఛైర్మన్‌ క్షమాపణ

సియోల్‌: విశాఖ జిల్లా ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ఎల్జీ పాలిమర్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కూ గ్వాంగ్‌ మో క్షమాపణ చెప్పారు. సియోల్‌ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు గ్యాస్‌ లీకేజీ ఘటనపై స్పందించారు. గత వారం రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఎంతో బాధ కలిగించాయని ఆయన అన్నారు. విశాఖలో జరిగిన ఘటనతో పాటు, దక్షిణ కొరియాలోని కెమికల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రమాదాలపై సంతాపం వ్యక్తం చేసిన కూ గ్వాంగ్‌ మో.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదాలకు సంబంధించి సంస్థ పూర్తి బాధ్యత తీసుకుటుందని ఆయన స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని