₹30వేలు బిల్లు.. అధికారుల సమాధానానికి షాక్‌!

తాజా వార్తలు

Published : 25/05/2020 00:34 IST

₹30వేలు బిల్లు.. అధికారుల సమాధానానికి షాక్‌!

భోపాల్‌: నెలవారీ కరెంటు బిల్లు చూసిన ఆ వినియోగదారుడికి షాక్‌ కొట్టింది. సర్లే.. విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందనుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. తీరా వాళ్లిచ్చిన సమాధానం చూసి అతగాడికి ఈ సారి అదిరిపోయే షాక్‌ కొట్టింది. కరెంటు బిల్లు తక్కువ కావాలంటే కాంగ్రెస్‌ను ఎన్నుకో అని వారు సమాధానం చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని అఘర్‌ మాల్వా జిల్లాకు చెందిన హరీష్‌ జాదవ్‌ అనే వినియోగదారుడికి ఈ నెల కరెంటు బిల్లు కింద రూ.30వేలు వచ్చింది. దీంతో మధ్యప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఓ కంప్లయింట్‌ ఐడీ ఇచ్చారు. తర్వాతి రోజు ఫిర్యాదు స్థితి కోసం వెబ్‌సైట్‌ తనిఖీ చేయగా.. ‘క్లోజ్‌’ అయినట్లు సందేశం కనిపించింది. తీరా అందుకు గల కారణం గురించి ఆరా తీస్తే.. ‘‘మీకు తక్కువ మొత్తం కరెంట్‌ బిల్లు కావాలా? అయితే అధికారంలో ఉన్న భాజపాను దింపేసి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురండి. అప్పుడు మీ బిల్లు ₹100 వస్తుంది’’ అని ఉంది. దీంతో జాదవ్‌ ఈ సారి విద్యుత్‌ శాఖ అధికారులతో పాటు, కలెక్టర్‌ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఇందుకు బాధ్యుడిని చేస్తూ సస్పెండ్‌ చేశారు. శాఖపరమైన విచారణకు ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని