రేపట్నుంచి విమాన సర్వీసులు పెరిగే అవకాశం
close

తాజా వార్తలు

Updated : 25/05/2020 19:49 IST

రేపట్నుంచి విమాన సర్వీసులు పెరిగే అవకాశం

హైదరాబాద్: శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం అన్ని జాగ్రత్తలూ చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉంటాయని, ఏదైనా అవసరమొచ్చినప్పుడు వారితో మాట్లాడతామని తెలిపారు. నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శంషాబాద్‌ విమానాశ్రయాన్ని రంగారెడ్డి కలెక్టర్‌తో కలిసి సందర్శించారు. అక్కడి అరైవెల్‌ మార్గాన్ని పరిశీలించారు. 

కరోనా లక్షణాలు కనిపిస్తే అన్ని రకాల పరీక్షలు చేస్తామని ఈ సందర్భంగా సీఎస్‌ తెలిపారు. ప్రయాణికుల వద్ద తప్పకుండా ఆరోగ్య సేతు యాప్‌ ఉండాలని సూచించారు. విమానం ఎక్కేముందు ప్రతి ప్రయాణికుడి ఉష్ణోగ్రత పరిశీలిస్తున్నామని, తక్కువగా ఉంటే అతడు ఏ వస్తువునూ ముట్టుకోకుండానే విమానంలోకి అడుగుపెట్టే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని నాన్‌ టచ్‌ విధానంలో జరుగుతున్నాయని తెలిపారు. ఇవాళ 19 చొప్పున విమానాలు వచ్చి వెళతాయని, రేపటి నుంచి విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని సీఎస్‌ చెప్పారు. ప్రయాణికులు లేకే కొన్ని విమానాలు రద్దు అవుతున్నాయని వివరించారు. కరోనా లక్షణాలు లేనివారికి క్వారంటైన్‌ లేదని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని