సంతోష్‌బాబుకు ప్రముఖుల నివాళి

తాజా వార్తలు

Updated : 18/06/2020 12:54 IST

సంతోష్‌బాబుకు ప్రముఖుల నివాళి

సూర్యాపేట: కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం రాత్రి 11.40 గంటలకు సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. దీంతో ఒక్కసారిగా బంధువుల రోదనలు మిన్నంటాయి. సంతోష్‌బాబు అమర్‌ రహే అంటూ బంధువులు, స్థానికులు పెద్దఎత్తున నివాదాలు చేశారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు.

ప్రముఖుల నివాళులు..
గురువారం ఉదయం సంతోష్‌బాబు భౌతికకాయానికి పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ డి.అర్వింద్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్‌బాబు పార్థివహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాసేపట్లో కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని