మరో గ్యాంగ్‌తోనూ ఒప్పందం!

తాజా వార్తలు

Updated : 29/09/2020 16:02 IST

మరో గ్యాంగ్‌తోనూ ఒప్పందం!

రూ.10 లక్షలకు మాట్లాడుకొని.. రూ.లక్ష చెల్లింపు

ఫోన్‌ ఆపేయడంతో మరో ముఠాతో హత్య

ఈనాడు, హైదరాబాద్‌, గచ్చిబౌలి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో రోజుకో అంశం వెలుగు చూస్తోంది. ఈఏడాది జూన్‌ 10న అవంతి, హేమంత్‌ల వివాహం కాగా, రెండు నెలలపాటు అవంతిని తమ వైపునకు తిప్పుకొనేందుకు కుటుంబ సభ్యులు యత్నించి విఫలమయ్యారు. హేమంత్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించడం ద్వారా దంపతులను విడదీయాలని భావించారు. ఇందుకోసం ఒకట్రెండు నెలల కిందటే యుగంధర్‌రెడ్డి ఓ గ్యాంగ్‌ సభ్యుడిని సంప్రదించాడు. రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సమాచారం ఇస్తే, కిడ్నాప్‌ చేద్దామంటూ ఆ వ్యక్తి చెప్పాడు. రెండు, మూడు సార్లు రెక్కీ నిర్వహించి ఫోన్‌ చేసినా ఇప్పుడొద్దులే అంటూ ఆ వ్యక్తి వాయిదా వేశాడు. ఆ తరవాత ఫోన్‌ ఆపేయడంతో బిచ్చూ యాదవ్‌ ముఠాతో ఒప్పందం చేసుకొని హత్య చేయించాడు.

శేరిలింగంపల్లి: అవంతి తండ్రి లక్ష్మారెడ్డి స్థానికంగా దశాబ్దాలుగా రేషన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతను జైల్లో ఉండడంతో దుకాణం మూసేశారు. సుమారు వెయ్యి మంది పేదలు నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని