Krishnapatnam: నెల్లూరు చేరుకున్న ఐసీఎంఆర్‌ బృందం

తాజా వార్తలు

Published : 21/05/2021 20:17 IST

Krishnapatnam: నెల్లూరు చేరుకున్న ఐసీఎంఆర్‌ బృందం

నెల్లూరు: కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయతను నిర్ధారించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) బృందం అక్కడికి చేరుకుంది. ఆయుర్వేద మందుపై అధ్యయనం చేసి శాస్త్రీయతను పరీక్షించనుంది. ఆయుర్వేద మందుపై గందరగోళం తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు. 

ఇవాళ్టి నుంచి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు. దీంతో సుమారు 3కి.మీ మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని