కృష్ణా నదికి భారీగా వరద

తాజా వార్తలు

Updated : 17/10/2020 13:57 IST

కృష్ణా నదికి భారీగా వరద

విజయవాడ: కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి 6.53లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా... 10 గేట్లను 33 అడుగుల మేర ఎత్తి 5.93లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దాదాపు 4.34లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 18 క్రస్ట్‌ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 4.92లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు ఇతర మార్గాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వస్తోంది. 6 లక్షల క్యూసెక్కుల  నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా..6లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు ముంపునకు గురవడంతో కృష్ణా కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. గత నాలుగైదు రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 180 టీఎంసీలు విడుదలైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 900 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని