హైదరాబాద్‌ జంట జలాశయాలకు భారీగా వరద

తాజా వార్తలు

Published : 21/07/2021 23:16 IST

హైదరాబాద్‌ జంట జలాశయాలకు భారీగా వరద

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలశయాలు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌ నగర శివారులో ఉన్న జంట జలాశయాల్లోకి భారీగా వరద వస్తోంది. హిమాయత్‌సాగర్‌లోకి 1000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో అధికారులు గేట్లు తెరిచారు. మూడు గేట్ల ద్వారా 1030 క్యూసెక్కుల ప్రవాహాన్ని మూసీ నదిలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1762.75 అడుగులుగా ఉంది. ఇక ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1784.80 అడుగులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్‌లోకి 200 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని