Corona Crisis: కిడ్నీ, లివర్‌ అమ్మకానికి పెట్టిన ఓ వ్యక్తి!

తాజా వార్తలు

Published : 16/07/2021 01:41 IST

Corona Crisis: కిడ్నీ, లివర్‌ అమ్మకానికి పెట్టిన ఓ వ్యక్తి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి వల్ల ఎందరో ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమయంలో యాచకుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దాంతో వారు తమ అవయవాలను అమ్ముకోవడానికి కూడా వెనుకాడటం లేదు. కేరళలోని ఓ యాచకుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడ్డానికి అవయవాలను అమ్మకానికి పెట్టాడు.

కేరళలో తిరువనంతపురానికి చెందిన రోనాల్డ్‌ (59) వీధుల్లో పాటలు పాడుతూ డబ్బు సంపాదించేవాడు. స్థిర నివాసం లేని రొనాల్డ్‌ ద్విచక్రవాహనాన్ని ఇల్లుగా మలచుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య అయిదేళ్ల క్రితం చనిపోయింది. కొడుకు జైల్లో ఉన్నాడు. తన మేనల్లుడు ఇటీవల అనారోగ్యం బారిన పడ్డాడు. లాక్‌డౌన్‌ వల్ల రొనాల్డ్‌కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మేనల్లుడికి చికిత్స చేయించడానికి, కుమారుడిని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి డబ్బు అవసరమైంది. దాంతో రొనాల్డ్‌ తన అవయవాలను అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు. తన ద్విచక్రవాహనానికి కిడ్నీ, లివర్‌ అమ్మబడును అనే బోర్డు తగిలించి ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని