‘ముంబయికర్లు.. ఉదయాన్నే వెనీస్‌ను చూస్తారు!’

తాజా వార్తలు

Updated : 18/07/2021 22:37 IST

‘ముంబయికర్లు.. ఉదయాన్నే వెనీస్‌ను చూస్తారు!’

ముంబయి వర్షాలపై నెటిజన్ల ట్రోలింగ్‌

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి వర్షాలతో తడిసిముద్దవుతోంది. గత కొన్ని రోజులుగా రాత్రులు కుండపోత వర్షం పడుతుండటంతో ఉదయం లేచి చూసే సరికి రోడ్లు కాలువల్లా మారిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌లు, రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం పరిపాటిగా మారింది. ఈ వర్షాల కారణంగా ముంబయివాసులను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం రాత్రి కూడా ముంబయిలో వర్షం కురుసింది. దీంతో ఆదివారం ఉదయం 6.30 గంటల సమయానికి ముంబయిలోని పలు ప్రాంతాల్లో 120మి.మీ.కుపైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లోనూ ముంబయిలో ఇలాగే భారీ వర్షాలు పడే అవకాశమున్నందున నగరంలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. 

అయితే, వర్షాల కారణంగా నదులను తలపిస్తున్న రోడ్లు, ట్రాఫిక్‌ చిక్కులు వంటి ఇక్కట్లను ప్రస్తావిస్తూ ముంబయి వాసులు నెట్టింట్లో సెటైర్లు వేస్తున్నారు. కొందరు నెటిజన్లు ట్విటర్‌లో హాస్యభరిత ట్వీట్లు పెడుతున్నారు. ‘ముంబయికర్లు ఉదయం లేవగానే వెనిస్‌లో కనిపించే అందమైన దృశ్యాలను చూస్తారు’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేసి జలమయమైన ఓ రోడ్డు ఫొటోను జత చేశారు. రేపు ఉదయం ప్రతి ముంబయివాసి వారి బాల్కనీ నుంచి సముద్రాన్ని చూస్తారంటూ మరొకరు ట్వీట్‌ పెట్టారు. ఈ క్రమంలో #MumbaiRains హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది. మరి ఆ ట్వీట్లను మీరూ చూసేయండి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని