Nikhileswar: రచయితలు పదవుల కోసం ఎగబడుతున్నారు: నిఖిలేశ్వర్‌

తాజా వార్తలు

Published : 19/09/2021 01:27 IST

Nikhileswar: రచయితలు పదవుల కోసం ఎగబడుతున్నారు: నిఖిలేశ్వర్‌

దిల్లీ‌: 2020 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలో శనివారం జరిగింది. 24 భాషల్లో రచనలు చేసిన ప్రఖ్యాత రచయితలకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలుగు రచయిత నిఖిలేశ్వర్‌ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ‘అగ్నిశ్వాస’ పుస్తకానికి గాను నిఖిలేశ్వర్‌కు ఈ అవార్డు వరించింది. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ఆయన పలు రచనలు చేశారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్‌ మాట్లాడుతూ... సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

‘‘ఏ నాటికైనా నా శ్వాస అగ్నిశ్వాస... ప్రజా పోరాటాల ధ్యాస నా లక్ష్యం. రచయిత లేదా కవి వ్యక్తి నుంచి సమష్టిలోకి ప్రవేశిస్తారు. మతం, కులం వైరుధ్యమైన ఈ వ్యవస్థలో రచయిత ఎంతో బాధ్యతతో దిశానిర్దేశం చేయాల్సి ఉంది. నేడు రచయిత, కవి అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అసహనంతో ఉన్నారు.  పాలకుల తప్పిదాలను వారి పొరపాట్లను ఎత్తి చూపితే సహించలేరు. రచయితలను నేడు జైలుకు పంపుతున్నారు. సమాజంలో కుల, మతాలు ఎలా ఏర్పడ్డాయో.. అదే తరహాలో రచయితల్లో కూడా వర్గీకరణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో రచయితలు కూడా పదవుల కోసం ఎగబడుతున్నారు. పాలక వర్గానికి రచయితలు సైతం భజన చేస్తున్నారు’’ అని నిఖిలేశ్వర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని