సీబీఎస్‌ఈ సిలబస్‌ తగ్గింపులో మార్పు లేదు
close

తాజా వార్తలు

Published : 27/02/2021 00:41 IST

సీబీఎస్‌ఈ సిలబస్‌ తగ్గింపులో మార్పు లేదు

దిల్లీ: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించే 10వ తరగతి సోషల్ సైన్స్‌ సబ్జెక్టుకు సంబంధించి సిలబస్‌ తగ్గింపులో ఎటువంటి మార్పు లేదని బోర్టు స్పష్టతనిచ్చింది. సిలబస్‌ తగ్గింపు విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయం తప్పితే.. కొత్తగా మరే నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. గతేడాది జులైలో కరోనా విజృంభణ, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సీబీఎస్‌ఈ 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల అన్ని సజ్జెక్టుల సిలబస్‌ను 30 శాతం మేర తగ్గిస్తున్నామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ సైతం తగ్గించిన సిలబస్‌ ఆధారంగా విద్యార్థుల పాఠ్య ప్రణాళికను రూపొందించి, నమూనా ప్రశ్నాపత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.

సీబీఎస్‌ఈ 10వ తరగతి విద్యార్థులకు వివిధ అంశాల్లో అబ్జెక్టివ్‌ రూపంలో నిర్వహించే సోషల్‌ సైన్స్‌ పరీక్ష వచ్చే నెల మార్చి 27న జరగనుంది. ఈ సబ్జెక్టులో సిలబస్‌ను తగ్గిస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం స్పందించిన ఆ బోర్టు.. సిలబస్‌ తగ్గింపు విషయంలో ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చింది. పాత నిర్ణయానికి అనుగుణంగానే పరీక్షలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చింది. ఏటా సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలకు సుమారు 18 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుంటారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10వ తరగతి ప్రధాన పరీక్షలు మే 4 నుంచి జూన్‌ 7 వరకు జరగనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని