ap news: కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

తాజా వార్తలు

Published : 24/07/2021 01:10 IST

ap news: కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

అమరావతి: పట్టణ స్థానిక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయరు, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నికకు ఎస్‌ఈసీ చర్యలు చేపట్టింది. రెండో డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లను నియమించాలన్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ఎస్‌ఈసీ ప్రకటన జారీ చేసింది. 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో  రెండో వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నికకూ ప్రకటన వెలువడింది.  నేతల ఎన్నిక కోసం ఈనెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. సమావేశానికి తప్పక హాజరుకావాలని ఎన్నికైన సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులను కోరారు. ఈనెల 26 లోపు సమావేశ వివరాలతో సమాచారం అందించాలని ఎస్‌ఈసీ కోరారు. ఏలూరు కార్పొరేషన్‌లోనూ ఈనెల 30నే మేయర్‌, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని