close

తాజా వార్తలు

Updated : 16/04/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒంటిమిట్ట ఆలయం మూసివేత



ఒంటిమిట్ట: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తితిదే, పురావస్తు అధికారుల సమక్షంలో ఆలయానికి నోటీస్‌ అంటించారు. మే  15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు నోటీసులో తెలిపారు. కోదండరామాలయంతోపాటు జిల్లాలోని మరో 15 ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయం మూసివేతతో ఈనెల 21నుంచి జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత నెలకొంది. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని