ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ప్రభాకర్‌రావు

తాజా వార్తలు

Updated : 01/11/2020 01:10 IST

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా టి.ప్రభాకర్‌రావు(రిటైర్డ్‌)ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో 1996 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన నవీన్‌చంద్‌ ఉన్నారు. అక్టోబర్‌ 31తో ఆయన ఉద్యోగ విరమణ చేస్తుండడంతో ప్రభుత్వం ప్రభాకర్‌రావుకు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వలు వచ్చే వరకు ప్రభాకర్‌రావు ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీలో ఐజీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని