Ts News: రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 21:25 IST

Ts News: రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రేపు మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతోన్న లాక్‌డౌన్‌ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపు, తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. లాక్‌డౌన్‌ విషయమై తదుపరి నిర్ణయాన్ని ఈ భేటీలో తీసుకోనుంది. వర్షపాతం, వానాకాలం సాగు, సాగు సంబంధిత అంశాలు, గోదావరిలో నీటి ఎత్తిపోత, జలవిద్యుత్‌ ఉత్పత్తి తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని