TS News: దేవర‌యాంజ‌ల్‌ భూముల్లో ఖాళీ చేయించొద్దు

తాజా వార్తలు

Updated : 27/05/2021 15:20 IST

TS News: దేవర‌యాంజ‌ల్‌ భూముల్లో ఖాళీ చేయించొద్దు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైద‌రాబాద్‌: దేవ‌ర‌యాంజ‌ల్ భూముల్లోని స్థానికుల‌ను ఖాళీ చేయించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.  భూముల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ పి.కిష‌న్‌రెడ్డి అనే స్థానికుడు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. షెడ్లు కూల్చేస్తామ‌ని, ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నార‌ని ఆయన పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఉన్నత న్యాయ‌స్థానం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనికి ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇస్తూ.. విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని, ఖాళీ చేయించ‌డం లేద‌ని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని