AP News: షాపింగ్‌ మాల్‌ ఎస్కలేటర్‌లో ఇరుకున్న చిన్నారి

తాజా వార్తలు

Published : 04/10/2021 12:02 IST

AP News: షాపింగ్‌ మాల్‌ ఎస్కలేటర్‌లో ఇరుకున్న చిన్నారి

విశాఖ: విశాఖలోని మద్దిలపాలెంలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లోని ఎస్కలేటర్‌లో చిన్నారి చిక్కుకుపోవడం అలజడి సృష్టించింది. ఆదివారం సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం నిన్న సాయంత్రం మాల్‌కు వచ్చింది. పై అంతస్తులోకి వెళ్లేందుకు వారు ఎస్కలేటర్‌ ఎక్కారు. మార్గంమధ్యలో చిన్నారి డ్రెస్‌ ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. భయంతో పాప గట్టిగా కేకలు వేయడంతో మాల్‌ సిబ్బంది వెంటనే ఎస్కలేటర్‌ను ఆపేశారు. దాదాపు 2 గంటల పాటు సిబ్బంది శ్రమించి పాపను బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని