CM jagan: అగ్నిప్రమాద మృతులకు పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

తాజా వార్తలు

Published : 31/07/2021 18:10 IST

CM jagan: అగ్నిప్రమాద మృతులకు పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

అమరావతి: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ మేరకు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని సూచించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని