Ts News: ధరణి పోర్టల్‌.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుంది: సీఎం కేసీఆర్

తాజా వార్తలు

Published : 28/10/2021 21:52 IST

Ts News: ధరణి పోర్టల్‌.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుంది: సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ ప్రారంభమై రేపటితో ఏడాది పూర్తి కానుంది. సంవత్సర కాలంలో ధరణి పోర్టల్‌కు 5.17 కోట్ల హిట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరణి ద్వారా ఇప్పటివరకు 10 లక్షలకుపైగా లావాదేవాలు.. 1.80 లక్షల ఎకరాలకు పాసుపుస్తకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ధరణిలో 31 రకాల సేవలు, 10 సమాచార మాడ్యూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ధరిణి ద్వారా ఇప్పటివరకు 5.17 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌ అమలుకు పని చేస్తున్న జిల్లా కలెక్టర్లు, అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అభినందనలు తెలిపారు. ధరణితో రైతులు ఎంతో ప్రయోజనం పొందారని సీఎం పేర్కొన్నారు. ధరణి ద్వారా పారదర్శకంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ధరణి మరిన్ని విజయాలు సాధిస్తుందని సీఎం ఆకాంక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని