జగన్‌ అక్రమాస్తుల కేసు: మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ

తాజా వార్తలు

Published : 17/08/2021 11:40 IST

జగన్‌ అక్రమాస్తుల కేసు: మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో 2 అభియోగపత్రాలు (ఛార్జిషీట్లు) దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ ఇప్పటి వరకు దాఖలు చేసిన 11 ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న ఈడీ.. ఇప్పటికే 7 అభియోగపత్రాలను కోర్టుకు సమర్పించింది. వాటిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. దీంతో పాటు తాజాగా వాన్‌పిక్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులకు సంబంధించిన మరో 2 ఛార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. ఈ రెండు ఛార్జిషీట్లు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. న్యాయస్థానం వాటిని పరిగణనలోకి తీసుకుంటే నిందితులకు సమన్లు జారీ అయ్యే అవకాశముంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని