రామప్ప సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు

తాజా వార్తలు

Published : 28/07/2021 13:11 IST

రామప్ప సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు

హైదరాబాద్‌: రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో విచారణ జరిగింది. పత్రికల కథనాలపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. యునెస్కో విధించిన గడువు విధించిన డిసెంబర్‌ నెలాఖరు వరకు సమగ్ర సంరక్షణ చేపట్టాలని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్ లతో కమిటీ ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఆగష్టు 4న ఆ కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో సంయుక్త పరిశీలన జరపాలని ధర్మాసనం వివరించింది. 

నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని వివరించింది. రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వ కారణం ధర్మాసనం తెలిపింది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను తీర్చిదిద్దాలని ఆదేశించింది. రామప్ప అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మారుతోందని కోర్టు తెలిపింది. ఈ కట్టడం చారిత్రకంగా అత్యంత విలువైనదని చెప్పింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని వివరించింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. కాల పరిమితులు విధించుకొని రామప్ప అభివృద్ధికి పని చేయండి అని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని