Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 22/10/2021 09:03 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.ఉపఎన్నికలకు మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ

ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం పొరుగున ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉపఎన్నికతో నేరుగా సంబంధం ఉన్న ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గాల సమీపంలో ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.

2.కోర్టు ముందు అందరూ సమానులే

కోర్టు ముందు అందరూ సమానులే అని కూకట్‌పల్లి కోర్టు న్యాయమూర్తి స్పష్టంచేశారు. డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతోపాటు సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానళ్లపై సినీ నటి సమంత పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని సమంత తరఫు న్యాయవాది కోరగా.. న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు.

3.కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

ప్రధాని నరేంద్రమోదీ కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్‌ చేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ ప్రసంగించే అవకాశముంది.

4.ఐటీలో జోరుగా వలసలు

ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల శాతం (అట్రిషన్‌ రేట్‌) వేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ పరిణామాల ప్రభావంతో, డిజిటల్‌ సేవల విస్తరణ పెరిగి.. ఐటీ కంపెనీలకు వినూత్నమైన, భారీ ప్రాజెక్టులు లభిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) తో కూడిన ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆయా విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఐటీ కంపెనీలకు అధికంగా కావాల్సి వస్తోంది. అందుకే ఇంజినీరింగ్‌, కంప్యూటర్స్‌ గ్రాడ్యుయేట్లను ఐటీ కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

5.సుశాంత్‌ కేసు వదిలేసి సినీ పరిశ్రమను టార్గెట్‌ చేశారు!

ముంబయిలోని నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆయన సినీ పరిశ్రమను టార్గెట్‌ చేశారన్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సమీర్‌ వాంఖడే ఓ తోలుబొమ్మ మాత్రమేనని, ఆయన్ను కొందరు ఆడిస్తున్నారన్నారు. సమీర్‌పై ఎవరు ఒత్తిడి తెస్తున్నారో చెప్పాలన్నారు.

6. ‘నల్ల చట్టాల రూపశిల్పి ఆయనే’.. అమరీందర్‌పై సిద్ధూ విమర్శలు!

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తీవ్ర విమర్శలు చేశారు. నల్ల చట్టాల (మూడు వ్యవసాయ చట్టాలు) రూపశిల్పి ఆయనేననంటూ ఆరోపించారు. ఈ మేరకు అమరీందర్‌ సింగ్‌ గతంలో మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు. కొత్తపార్టీ పెడతానని అమరీందర్‌ సింగ్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుల సమస్య సానుకూలంగా పరిష్కారమైతే.. 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అకాలీ గ్రూపులు వంటి మిత్రపక్షాలతో పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు.

7.మేడం ప్లీజ్‌.. మాకు వధువులను వెతికిపెట్టండి!

పెళ్లంటే అనిర్వచనీయమైన అనుభూతి.. ఓ జంట జీవితంలో మధుర జ్ఞాపకం.. ఈడొచ్చిన ప్రతి యువతీ, యువకులు అలాంటి శుభ ఘడియలు రావాలని ఆరాటపడుతుంటారు.. పచ్చ తోరణాలు, ఇంటి నిండా బంధుగణం, బాజాభజంత్రీలు, మంగళకరమైన వాతావరణం చూస్తే ఎవరికైనా మనసు ఆనంద డోలికల్లో తేలియాడాల్సిందే.. మారిన ఆధునిక పోకడలు కొందరు బ్రహ్మచారులకు శుభలేఖలు రాసుకునే అదృష్టం కలగడం లేదు.. పెరుగుతున్న వయోభారం వారిని మరింత కుంగదీస్తోంది.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఏదోక ‘కొలువుంటేనే’ పిల్లనిస్తామంటూ వెనకడుగు వేస్తున్నారు.

8.పాకిస్థాన్‌కు రాహుల్‌ నుంచే ప్రమాదం ఎక్కువ: హెడెన్‌

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య టీ20 ప్రపంచకప్‌ పోరులో నాయకత్వమే కీలకం అవుతుందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈసారి ఐపీఎల్‌లో ధోని, మోర్గాన్‌లు వ్యక్తిగతంగా రాణించలేదు. కాని నాయకత్వ పటిమతో తమ జట్లు ఫైనల్‌ చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. కాబట్టి యూఏఈ పరిస్థితుల్లో దాయాదుల పోరులో నాయకత్వమే కీలకం అవుతుంది.

టీ20 ప్రపంచకప్‌ టాప్ స్కోరర్.. బౌలర్‌ ఎవరో చెప్పేసిన బ్రెట్‌ లీ

9. 95 శాతం భారతీయులకు పెట్రోలే అవసరం లేదు.. యూపీ మంత్రి వ్యాఖ్యలు
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులు కుదేలవుతోన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి ఉపేంద్ర తివారీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ‘ఇంధన ధరల పెంపు విషయానికొస్తే అసలు 95 శాతం మంది భారతీయులకు పెట్రోలే అవసరం లేదు. కొద్దిమంది మాత్రమే కార్లు వినియోగిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

10.లాకర్లో.. భద్రంగా..

బంగారం.. విలువైన పత్రాలు.. దాచుకోవడానికి నమ్మకమైన చోటు బ్యాంకు లాకర్‌ అని చాలామంది విశ్వాసం. ఒకవేళ లాకర్‌లో పెట్టిన వస్తువులు మాయమైతే ఏమిటి పరిస్థితి? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? లాకర్‌ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని