Top 10 News @ 9 PM

తాజా వార్తలు

Updated : 27/04/2021 21:35 IST

Top 10 News @ 9 PM

1. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదు: ఈటల

తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదని.. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ పంపుతున్నట్లు చెప్పారు. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు ఐఏఎస్‌ అధికారులను నియమించినట్లు ఈటల వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS: ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అసంతృప్తి

2. Corona: ఏపీలో 64మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,435 పరీక్షలు నిర్వహించగా.. 11,434 కేసులు నిర్ధారణ కాగా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,54,875 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌లో తీవ్ర సంక్షోభానికి కారణాలివే..! WHO

కరోనా బాధితులు అనవసరంగా ఆసుపత్రులకు పరుగుతీయడమే భారత్‌లో కరోనా సంక్షోభం మరింత తీవ్రమవడానికి ఒక కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. ప్రజలు సమూహాలుగా ఏర్పడడం, కొత్త రకాల కరోనా వైరస్‌లు వెలుగుచూడడం, తక్కువ మందికే వ్యాక్సిన్‌ అందడం వంటి అంశాలు భారత్‌లో కరోనా వైరస్‌ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

oxygen cylinder: ఒక్క రూపాయికే!

4. Home Isolationలో ఉన్నారా.. ఇవి తినండి

కొవిడ్‌ నిర్ధారణ అయి హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, అన్‌శాచ్యూరేటెడ్‌ ఫ్యాట్‌ తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం చేపలు, ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చు. చికెన్‌ కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. విటమిన్‌ సి అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు కనీసం రెండు సార్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఎండు ఫలాలు(డ్రైఫ్రూట్స్‌), బెల్లం, నువ్వులు, నెయ్యితో కలిపి చేసిన లడ్డూలు రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరానికి అవసరమైన జింక్‌, మెగ్నీషియం, మాంగనీస్‌ అందుతాయని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’

కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ వైరస్‌ వాయు వేగంతో వ్యాపిస్తుండటంతో భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్పత్రుల్లో పడకల్లేవ్‌.. ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేవు.. చివరకు శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలకు సైతం చోటు దొరకని దుస్థితి అందరినీ కలచివేస్తోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు, ఆరోగ్యరంగ నిపుణులు. అప్రమత్తతతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌పై పోరాటంలో జయం మనదేనంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆవేశం.. చనిపోయిన వారిని తీసుకురాలేదు!

6. Corona: విశాఖలో ఏడాదిన్నర చిన్నారి మృతి

విశాఖ కేజీహెచ్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారిని కొవిడ్ బలితీసుకుంది. కొవిడ్‌తో బాధపడుతున్న చిన్నారి ఆస్పత్రి ప్రాంగణంలోనే గంటన్నరపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. విశాఖ జల్లా అచ్యుతాపురం మండలానికి చెందిన వీరబాబు.. జలుబుతో బాధపడుతున్న తన కుమార్తె జాహ్నవికను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అక్కడి వైద్యుల సూచనల మేరకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Zoom: ఎక్కడెక్కడ ఉన్నా ఒకేచోట ఉన్నట్లు

ఆఫీసు మీటింగ్‌, కంపెనీ సెమీనార్‌లు, స్కూలు పాఠాలు... ఇవన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో సాగిపోతున్నాయి.  అయితే ఎక్కడో ఏదో చిన్న వెలితి. మీటింగ్‌లో సెమినార్‌  చెప్పే వక్తలు పక్కపక్కన కూర్చుంటే బాగుంటుంది కదా. క్లాస్‌ రూమ్‌లో పిల్లలు హాలు మొత్తం కూర్చున్నట్లు ఉంటే బాగుండు కదా! ఇదేదో బ్లాక్స్‌లో ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నారు. అయితే త్వరలో ఈ ఇబ్బంది ఉండదు. ఇమ్మెర్సివ్‌ వ్యూ పేరుతో జూమ్‌కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఆ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే... పైన ఫొటోలు కనిపించినట్లుగా అందరూ ఇలా పక్కపక్కన చేరిపోతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

త్వరలో Hey Google అనక్కర్లేదు

8. రాశి ముద్దులాట.. విష్ణు జంప్‌.. భూమిక ‘ఖుషి’ 

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు- అసలైన ప్రేమ అంటే ఇదేనంటూ నటి రాశీఖన్నా ఒక వీడియోను పంచుకుంది. అందులో ఒక చిన్నారికి ముద్దులు పెడుతూ కనిపించిందామె. 40 ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు అనుకున్నట్లుగా జంప్‌ చేశానని మంచు విష్ణు ఒక వీడియో పంచుకున్నారు. నటి పూనమ్‌కౌర్‌ బురదమయంగా మారింది. తన స్నేహితులతో కలిసి బురద పూసుకొని ఫొటోలకు పోజులిచ్చింది. యోగినీస్‌ అంటూ ఫొటో పోస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. PBKSలో ఏ ఇద్దరు చెలరేగినా అంతే: సెహ్వాగ్‌

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు తమ బ్యాటింగ్‌ సమస్యలను అధిగమించాలని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సూచించాడు. ఇకపై విజయాలు సాధించాలంటే టాప్‌ ఆర్డర్‌ రాణించాలన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్లో మాట్లాడిన వీరూ.. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంపై స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 20 క్రయోజనిక్‌ ట్యాంకర్ల దిగుమతి!

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత ఇంకా ఆందోళన కలిగిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం 20 క్రయోజనిక్‌ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంది. 10 మెట్రిక్‌ టన్నులు, 20 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఈ ట్యాంకర్లను ఉత్పత్తి కేంద్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు వినియోగించనున్నారు. ఆస్పత్రులకు కరోనా బాధితుల తాకిడి పెరగడంతో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్(Liquid medical oxygen-LMO) కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని