టాప్‌ 10 న్యూస్‌ @ 9AM
close

తాజా వార్తలు

Published : 13/04/2021 08:55 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

1. ఉగాది ప్రాశస్త్యం ఏమిటి? ఈ రోజు ఏం చేయాలి?

ఉగాది అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటి రోజు అని ఒక అర్థం. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేదా జంట అని అర్థం. మన భారతీయ సంప్రదాయం ప్రకారం యుగమునకు ఆది కాబట్టి.. ఉగాది అని, సకల రుతువులకు చైత్రం ఆది గనక చైత్రమాసంలో వచ్చిన ఉగాది అని అంటాం. చైత్ర శుక్లపాడ్యమి అనగా.. ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.  మన పురాణాల్లో వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతార ధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునే ఉగాదిగా ఆచరణలోకి వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ఉచ్చు బిగుస్తోంది!

సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు మత్తుమందుల కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ప్రధాన పాత్రధారి అయిన హైదరాబాద్‌ వ్యాపారి కల్‌హర్‌రెడ్డి నోరు విప్పేందుకు సిద్ధమయ్యాడు. దాంతో ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న తెలంగాణ శాసనసభ్యుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. కలహర్‌రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని గోవిందపుర పోలీసుల అదుపులో ఉండగా ట్రావెల్స్‌ యజమాని అయిన రతన్‌రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. మొత్తం కేసుల్లో 2వ స్థానంలో భారత్‌

దేశంలో కరోనా కేసులు మరింత ఉద్ధృతమయ్యాయి. మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయిలో ఒక్కరోజే 1,68,912 కొత్త కేసులొచ్చాయి. 904 మంది మృతి చెందారు. గత అక్టోబరు 18 తర్వాత ఇంతగా ప్రాణనష్టం సంభవించడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య పరంగా ఇప్పటివరకు అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లు వరసగా మొదటి మూడు స్థానాల్లో ఉండేవి. ఇప్పుడు రెండో స్థానంలో బ్రెజిల్‌ బదులు భారత్‌ ఉంది. జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం (జేహెచ్‌యూ) గణాంకాల ప్రకారం ప్రపంచంలో 13.61 కోట్ల కేసులుంటే వాటిలో అమెరికాలో 3.11 కోట్ల కేసులు ఉన్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

‘ఈనాడు’ కథావిజయం ఫలితాలు విడుదల

4. రైతులపై పిడుగుపాటు

మొన్నటివరకూ ఎండలు మండగా..  సోమవారం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ అకాలవర్షాలకు రైతులు అవస్థలు పడ్డారు. కల్లాల్లో, మార్కెట్‌ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో నష్టపోయారు. వర్షానికితోడు పిడుగులు పడడంతో దంపతులు సహా ఆరుగురు మృతి చెందారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో దాదాపు 130 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. ఐపీఎల్‌: ఆసక్తికర విశేషాలు!

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో రాహుల్‌ సెంచరీని అడ్డుకుంటూ రాహుల్‌ తెవాతియా పట్టిన క్యాచ్‌ అద్భుతం. కేఎల్‌ జోరు చూస్తే కచ్చితంగా శతకం చేసేలాగే కనిపించాడు. కానీ తెవాతియా అతడి ఆశలకు గండి కొట్టాడు. సకారియా వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ రెండో బంతికి మిడ్‌ వికెట్‌ మీదగా భారీ షాట్‌ ఆడాడు కేల్‌. చూస్తే కచ్చితంగా సిక్స్‌ అనిపించిందా షాట్‌. కానీ బౌండరీ లైన్‌ దగ్గర బంతిని గాల్లోనే అందుకున్న తెవాతియా ఆ ఊపులో లైన్‌ దాటేశాడు. కానీ దానికి ముందే బంతిని మైదానంలోకి విసిరిన అతడు మళ్లీ వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. నోటి శుభ్రతతో.. కొవిడ్‌కు అడ్డుకట్ట

కరోనా వైరస్‌ శరీరంలో ప్రవేశించే ప్రధాన మార్గాల్లో ముక్కు, నోరు, కళ్లు ముఖ్యమైనవి. ప్రధానంగా నోటి ద్వారా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు 70 శాతానికిపైగా అవకాశం ఉంటుందనేది వైద్యనిపుణుల విశ్లేషణ. అందుకే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే, కొవిడ్‌ తీవ్ర దశకు చేరుకోకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుందని అంతర్జాతీయ పరిశోధకులు వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన ఓరల్‌ సైన్సెస్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణయినట్టు ప్రకటించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. గగనానికి మానవుడి నిచ్చెన!

రోదసిలో నుంచి భూమి దిశగా వ్యోమనౌక దూసుకొస్తోంది. స్పేస్‌సూట్‌ ధరించిన ఒక వ్యోమగామి అందులో కూర్చొని ఉన్నారు. భూ గురుత్వాకర్షణ బలం తాకిడికి ఓ విధంగా ఆయన తన సీట్లో కూలబడ్డారు. స్పేస్‌క్రాఫ్ట్‌ కిటికీ అద్దంలో నుంచి ఖగోళాన్ని యథాలాపంగా పరికించారు. అప్పుడు కనిపించిన దృశ్యంతో ఆయన అప్రమత్తమయ్యారు. వ్యోమనౌకను అగ్నికీలలు ముంచెత్తడం ఆయన కంటపడింది. వెంటనే రేడియో సాధనం ద్వారా భూ కేంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నేను కాలిపోతున్నా.. గుడ్‌బై కామ్రేడ్స్‌’’ అని చెప్పి ముగించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

గుండెల్ని పిండేసిన మారణకాండ!

8. మా ఇద్దరి భావజాలం ఒక్కటే

ప్రకాష్‌రాజ్‌... ఓ భావాల పుట్ట. అభినయంలో దిట్ట. ఆయనో చిన్న సంభాషణ చెబితే చాలు... ఆయనకొక చిన్న ముఖ కవళిక చాలు...ఆ సన్నివేశం తన వశం కావల్సిందే. చేసే పాత్రకి ప్రత్యేకమైన వన్నె  చేకూరాల్సిందే! అవలీలగా పాత్రల్లో ఒదిగిపోయే విలక్షణ నటుడు... ప్రకాష్‌రాజ్‌. ఇటీవల విడుదలైన ‘వకీల్‌సాబ్‌’తో మరోసారి నందాగా మెరిశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. రోజూ కావాలి షడ్రుచులు

తెలుగువారి తొలి పండగైన ఈ ఉగాది పర్వదినాన్ని సంబరంగా చేసుకుంటాం. ఈరోజున షడ్రుచుల కమ్మదనాన్ని ఆస్వాదిస్తాం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు రుచుల సమ్మేళనాన్ని కష్టసుఖాలుగా జీవితానికి అన్వయించుకుంటాం. ఈ ఆరు రుచుల సంగమం... మహిళల ఆరోగ్యాన్నీ,  అందాన్నీ ఎలా పరిరక్షిస్తుందో తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో వేసే బెల్లంలో మహిళల ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలెన్నో ఉన్నాయి. భోజనం తర్వాత తినే చిన్న బెల్లం ముక్క ఆహారాన్ని పూర్తిగా జీర్ణమయ్యేలా చేస్తుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. పాఠాలు చెబుతూ.. ప్రాణాలొదిన ఉపాధ్యాయిని

విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉపాధ్యాయిని గుండెపోటుతో మృతిచెందిన ఘటన చినపారుపూడి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. మసిముక్కు శ్రీదేవి(54) ఉదయమే పాఠశాలకు వచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రధానోపాధ్యాయుడు మోహన్‌రావు, ఉపాధ్యాయులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతిచెందారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని