Top 10 News @ 9AM

తాజా వార్తలు

Published : 28/04/2021 08:57 IST

Top 10 News @ 9AM

1. చౌక ధరలో కరోనా మందు బిళ్ల! 

దేశంలో కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత, అధిక ధరలు, మరోవైపు నిండుకుంటున్న ఆక్సిజన్‌ నిల్వలు ప్రధాన సమస్యలుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయంగా మందు బిళ్ల రూపంలో ఉండే చౌకైన ఔషధం కొద్ది నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ) డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలెలా?

రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు ఉచిత టీకాల అందజేతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ భారీ కార్యక్రమం వచ్చే నెల 1న ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. బుధవారం నుంచి కొవిన్‌ యాప్‌లో ఈ కేటగిరీలో సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో.. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా.. అని అర్హులు ఎదురుచూస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Oxygen ఓ వాయువు కాదు.. ఆయువు 

కొవిడ్‌ అత్యవసర చికిత్సలో బాధితులకు ఆక్సిజన్‌ ఇవ్వడం కీలకంగా మారింది. మలిదశలో అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. శ్వాస పీల్చుకోలేక... అపస్మారక స్థితిలో ఉన్నవారికి కృత్రిమ ప్రాణవాయువు ఇస్తే మృత్యువు నుంచి బయట పడుతున్నారు. సాధారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్నా... గాలి పీల్చుకోలేకపోయినా వారికి ఆక్సిజన్‌ ఇస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
4. Coronaకు కళ్లెం వేశారు! 

కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు మహమ్మారిని నిలువరించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. నాలుగు వందలకు పైగా కేసులు నమోదైనా ఒక్క మరణం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించి ఔరా అనిపించుకుంటున్నారు. ఈ ఘనతలో గ్రామస్థుల సమష్టి కృషికి స్థానిక వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధుల సహకారం తోడుగా నిలిచింది. వారి విజయగాథను మనమూ తెలుసుకుందాం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. అస్సాంలో భూకంపం..!

గువహటి: అస్సాంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం  (ఎన్‌ఎసీసీ) ధ్రువీకరించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సైతం భూకంపం సంభవించినట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘అస్సాంలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. పూర్తి వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది’ అంటూ సీఎం ట్వీట్‌లో పేర్కొన్నారు. సోనిత్పూర్‌ జిల్లా, దేకియాజులీ కేంద్రంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు. గువహటిలో భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసమైన చిత్రాలను సైతం పోస్ట్‌ చేశారు.

6. సూది గుచ్చకుండా సొమ్ములు జేబులోకి 

రోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో మానవత్వం మరచిన కొన్ని ఆసుపత్రులు, వాటికి వత్తాసు పలికే వైద్యులు కొత్తరకం దోపిడీకి తెరతీశారు. కొవిడ్‌ రోగుల అత్యవసర పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుంటూ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను అధిక ధరలకు బాధితులతో కొనుగోలు చేయిస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్న నాలుగు కేసుల్లో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను కాసుల కక్కుర్తితో ఆసుపత్రుల నిర్వాహకులే దారిమళ్లించినట్లు గుర్తించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. Covidతో వాసన కోల్పోయారా..?ఇలా ప్రయత్నించండి!

కరోనా వైరస్‌ సోకిన వారిలో అనేకమంది వాసన కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారు కొన్ని రకాల మందులను వాడడం ద్వారా మళ్లీ వాసన పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇలాంటి స్టెరాయిడ్లు వాడడం మంచిది కాదని.. కొన్ని సహజ ప్రక్రియల ద్వారా వాసన సమస్యను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. ఏబీ అదరహో..

ఏబీ మెరిశాడు. బెంగళూరు మురిసింది. డివిలియర్స్‌ ధనాధన్‌ ముగింపుతో మెరుగైన స్కోరు సాధించిన కోహ్లీసేన.. ఉత్కంఠ పోరులో దిల్లీకి కళ్లెం వేసింది. విధ్వంసక బ్యాటింగ్‌తో హెట్‌మయర్‌ కలవర పెట్టినా.. ప్రత్యర్థిని ఒక్క పరుగు దూరంలో ఆపేసింది. ఆఖరి ఓవర్లో సిరాజ్‌ చక్కగా బౌలింగ్‌ చేసి దిల్లీ ఆశలకు చెక్‌ పెట్టాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. 6 నెలల్లో చుక్కల టీకా

కొవిడ్‌-19 నిరోధానికి ముక్కు ద్వారా తీసుకునేందుకు అనువైన చుక్కల టీకా అందుబాటులోకి రావడానికి మరో 6 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్ల తెలిపారు. ఇప్పటికే ఈ టీకాపై మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయని, రెండు - మూడో దశ పరీక్షలు చేయడానికి 3-6 నెలలు అవసరమని పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. పైసలిస్తేనే.. ఇది ప్రైవేటు మార్కు

ఇంటర్‌ బోర్డు హెచ్చరికలు బేఖాతరు చేస్తూ నగరంలోని పలు కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నాయి. నెలాఖరులోపు ఫీజులు కట్టకపోతే రెండో ఏడాదికి పంపించేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రస్తుతానికి పరీక్షలు లేకుండా రెండో ఏడాదికి ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని