close

తాజా వార్తలు

Published : 15/04/2021 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆన్‌లైన్‌ రుణయాప్‌లపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ రుణ యాప్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. యాప్‌లపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. రుణ యాప్‌లపై 56 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రుణాల కోసం వేధిస్తున్న 118 మొబైల్‌ నంబర్లను గుర్తించామని.. 290 యాప్‌లను బ్లాక్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భారత్‌తో పాటు చైనా, విదేశాలకు చెందిన మరికొంతమంది ప్రమేయం ఉందని.. ఆర్‌బీఐ అనుమతి లేని రెండు ఎన్‌ఎఫ్‌బీఐలను గుర్తించామని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అనుమతి లేని ఎన్‌ఎఫ్‌బీలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. మరిన్ని వివరాలతో నాలుగు వారాల్లో మరో నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం డీజీపీని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని