పరీక్షల వాయిదా పిటిషన్‌కు టీఎస్‌ హైకోర్టు నో

తాజా వార్తలు

Updated : 05/07/2021 12:20 IST

పరీక్షల వాయిదా పిటిషన్‌కు టీఎస్‌ హైకోర్టు నో

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల వాయిదాపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయడానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నించారు. పిటిషన్‌ స్వీకరణకు అనుమతి కోరగా.. స్పందించిన హైకోర్టు పరీక్షల అంశాన్ని అత్యవసర విచారణకు నిరాకరించింది. చివరి నిమిషం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా లంచ్‌మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. మరోవైపు ఈ ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద డిగ్రీ, పీజీ విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని నిరసన తెలిపిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని