Ts News: గురుకుల కళాశాలలకు విద్యార్థుల ఎంపిక
close

తాజా వార్తలు

Published : 23/06/2021 23:34 IST

Ts News: గురుకుల కళాశాలలకు విద్యార్థుల ఎంపిక

హైదరాబాద్‌: తెలంగాణలోని ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించారు. పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసినట్లు సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 126 కళాశాలల్లో 10,800 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. www.tswreis.in, www.tswreis.ac.in వెబ్ సైట్లలో ఎంపికైన విద్యార్థుల వివరాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 25 నుంచి జులై 5 వరకు విద్యార్హత ధ్రువపత్రాలతో కళాశాలల్లో రిపోర్టు చేయాలని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని