ఖమ్మంపాడులో 30 మందికి అస్వస్థత

తాజా వార్తలు

Published : 17/07/2021 14:00 IST

ఖమ్మంపాడులో 30 మందికి అస్వస్థత

పెనుగంచిప్రోలు: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామంలో తాగునీరు కలుషితం అవడం వల్ల సుమారు 30 మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో పలువురికి వాంతులు, విరేచనాలయ్యాయి. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యులు చికిత్స అందించారు. సమాచారం అందుకున్న వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్ అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

అనంతరం వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. గ్రామానికి సమీపంలోని మున్నేరు నుంచి రక్షిత తాగునీరు సరఫరా అయ్యే పైపులైన్‌కు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలోని పురాతన బావి నుంచి గత వారం రోజులుగా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు. ఈ క్రమంలో బావినీరు కలుషితం కావడం వల్లే ప్రజలు ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోందని అధికారులు భావిస్తున్నారు. బావిలోని నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని