TS NEWS: మూడ్రోజుల్లో ముసురు

తాజా వార్తలు

Published : 08/06/2021 17:28 IST

TS NEWS: మూడ్రోజుల్లో ముసురు

హైదరాబాద్‌: రాగల రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురియడంతో పాటు, ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మరట్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడిందని వెల్లడించారు. ఈరోజు కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని