డబుల్‌ బెడ్‌రూం ఇల్లు వెనక్కిచ్చిన మహిళ

తాజా వార్తలు

Updated : 09/01/2021 13:37 IST

డబుల్‌ బెడ్‌రూం ఇల్లు వెనక్కిచ్చిన మహిళ

సిద్దిపేట: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఒక కలలాంటిది. ఆ కలను నెరవేర్చుకునేందుకు ప్రతి పైసా కూడబెడతాం. ఓ మహిళ సొంతింటి కలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నెరవేర్చింది. డబుల్‌ బెడ్‌రూం పథకంలో భాగంగా ఆమెకు ఇంటిని మంజూరు చేసింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇక హమ్మయ్య అనుకుంటారు. వారి తర్వాత వారసులకు ఆ ఇల్లు ఉంటుందనే భరోసాతో జీవనం సాగిస్తారు. కానీ సిద్దిపేటలో ఓ మహిళ దీనికి భిన్నంగా చేసిన పనితో అందరి మన్ననలు అందుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన రచ్చ లక్ష్మి భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. భర్త చనిపోవడంతో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేసింది. ప్రభుత్వం తరఫున ఆమెకు ఇంటి పట్టా కాగితాలను జిల్లా కలెక్టర్‌ అందజేశారు. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని రచ్చ లక్ష్మి తిరిగిచ్చి అందర్నీ విస్మయానికి గురిచేసింది. ‘‘నా భర్త చనిపోయారు. నా కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత నేనొక్కదాన్నే ఉంటున్నాను. ఈ సమయంలో నాకు అంత పెద్ద ఇల్లు అక్కర్లేదు. నేను నా సోదరుల వద్దే ఉంటాను. అందుకే ఇంటిని తిరిగి అప్పగిస్తున్నాను. ఈ ఇంటిని నాలాంటి మరో పేద కుటుంబానికి అందించండి’’ అని చెప్పి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిజాయతీగా ఇంటిని అప్పగించినందుకు లక్ష్మిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇలా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సూచించారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తానని ఈ సందర్భంగా హరీశ్‌ హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని