నేను పుట్టి ఉండేదాన్ని కాదు! తల్లికి సలహా ఇవ్వని డాక్టర్‌పై కుమార్తె దావా

తాజా వార్తలు

Updated : 25/11/2021 17:48 IST

నేను పుట్టి ఉండేదాన్ని కాదు! తల్లికి సలహా ఇవ్వని డాక్టర్‌పై కుమార్తె దావా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌కి చెందిన 20 ఏళ్ల ఈవ్‌ టూంబెస్‌ ఓ షో జంపర్(గుర్రపు స్వారీ). కానీ, పుట్టుకతోనే ‘స్పైనా బిఫిడా’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవారిలో వెన్నెముక సరిగా అభివృద్ధి చెందదు. దీంతో శరీర కదలికలో ఇబ్బందులు ఏర్పడతాయి. అంతటి వ్యాధితో బాధపడుతూ కూడా ఈవ్‌ ఎంతోకష్టపడి జీవితంలో మంచి స్థాయికి ఎదిగింది. 2018లో ‘ఇన్స్‌పిరేషన్‌ యంగ్‌ పర్సన్‌’అవార్డును సైతం గెలుచుకుంది. అయినా.. అందరిలా సాధారణ జీవితం గడపలేకపోతున్నానే బాధ ఆమెను నిత్యం వెంటాడుతూ వస్తోంది. దీనికి కారణాన్ని ఆన్వేషించిన ఆమె తాజాగా తన తల్లికి వైద్యసూచనలు ఇచ్చిన వైద్యుడిపై దావా వేసింది. సూచనలు ఇవ్వడంలో వైద్యుడు విఫలమయ్యాడని, తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోర్టును కోరుతోంది.

‘‘గర్భం దాల్చినప్పుడు బిడ్డకు స్పైనా బిఫిడా రాకుండా ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్స్‌ వాడాల్సిన అవసరముంది. డాక్టర్‌ ఫిలిప్‌ మిషెల్‌ ఈ విషయాన్ని నా తల్లికి చెప్పలేదు. ఆ విషయం చెప్పి ఉంటే.. తగిన జాగ్రత్తలు పాటించేవారు. నేను పుట్టి ఉండేదాన్ని కాదు’’అని ఈవ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఫోలిక్‌ యాసిడ్‌ కోర్సు అవసరం లేదని, మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని డాక్టర్‌ ఫిలిప్‌ తనకు చెప్పినట్లు ఈవ్‌ తల్లి కోర్టుకు వివరించింది. అయితే, డాక్టర్‌ తరఫు న్యాయవాది మాత్రం.. ఈవ్‌ తల్లిదండ్రులకు ఫోలిక్‌ యాసిడ్‌ చికిత్స గురించి ముందుగానే చెప్పినట్లు వాదించారు. ఇక ఈవ్‌ విషయానికొస్తే.. తన వయసుతోపాటు వ్యాధి కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో తను వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యే ప్రమాదముందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. మరి కోర్టు ఏ విధంగా తీర్పునిస్తుందో వేచి చూడాలి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని