close

తాజా వార్తలు

681 బియ్యం బస్తాలవాపస్

వంటశాలలోతనిఖీ చేస్తున్న ఏడీ వెంకటేశ్వరరావు

ఒంగోలు విద్య, న్యూస్‌టుడే: : అన్నంలో పురుగులు వస్తుండటంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినలేకపోతున్న విద్యార్థుల పరిస్థితిపై ‘అధ్వాన భోజనం’ శీర్షికతో ఈ నెల 19వ తేదీ ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. ఒంగోలు క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్న త్రోవగుంట సమీపంలోని ‘ఏక్తాశక్తి’ ఫౌండేషన్‌ కేంద్రీకృత వంటశాలను సోమవారం జిల్లా మధ్యాహ్న భోజన పథకం ఏడీ వెంకటేశ్వరరావు స్వయంగా  తనిఖీ చేశారు. అంతకు రెండు రోజుల కిందటే డీఈవో సూచనల మేరకు ముక్కిపోయిన, పురుగులు పట్టిన 681 బస్తాల బియ్యంను ఎఫ్‌సీఐకి పంపారు. సోమవారం వంటశాలను తనిఖీ చేసిన ఏడీ బియ్యం నిల్వలు, కోడిగుడ్లు, వంటనూనె, హాట్‌ప్యాక్‌లు, వంటశాలను పరిశీలించి.. నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి ప్రస్తుతం సరఫరా అవుతున్న బియ్యం నాణ్యంగా లేకపోవడంతో పరిశీలించి.. డీఈవో ఆదేశాల మేరకు ఎఫ్‌సీఐకి వాపసు చేశామన్నారు. కోడిగుడ్ల విషయంలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే.. వాటిని సంబంధిత ఏజెన్సీలకు తక్షణమే వాపసు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు.

223 పాఠశాలలకు...

త్రోవగుంటలోని ఏక్తాశక్తి ఫౌండేషన్‌ కేంద్రీకృత వంటశాల నుంచి ఒంగోలు క్లస్టర్‌ పరిధిలోని మద్దిపాడు, ఎస్‌ఎన్‌పాడు, టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు మండలాల్లోని 223 పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోంది. ఈ పథకం ద్వారా ఆయా పాఠశాలల్లోని సుమారు 20 వేల మంది విద్యార్థులకు భోజనం చేస్తున్నారు. నిత్యం ఒక టన్ను బియ్యం వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఒకేసారి రెండు, మూడు నెలలకు సరిపడా బియ్యం సరఫరా అవుతున్నాయి. దీంతో చివరకు వచ్చేసరికి బియ్యం ముక్కిపోవడం, పురుగులు చేరడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి.

నాణ్యతలో రాజీ లేదు...

గత నెల రోజులుగా బియ్యంలో అధికంగా పురుగులు వస్తుండటంతో వాటిని ఒకటికి రెండు సార్లు గ్రేడింగ్‌ చేయిస్తున్నాం. అయినప్పటికీ ఫలితం ఉండడం లేదు. దీంతో విషయాన్ని లిఖిత పూర్వకంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే ఉన్న నిల్వలను తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వాటి స్థానంలో మంచి బియ్యం సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు మధ్నాహ్న భోజనాన్ని సరఫరా చేసే నిమిత్తం 12 లీటర్లు, 5 లీటర్ల సామర్థ్యం కలిగిన హాట్‌ ప్యాక్‌లను కూడా నూతనంగా కొనుగోలు చేశాం. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ లోపాలు లేకుండా భోజనాన్ని సరఫరా చేస్తున్నాం.

- ఖాన్, ఏక్తాశక్తి ఫౌండేషన్‌ ఒంగోలు బాధ్యులు


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.