close

తాజా వార్తలు

ప్రమాణాల్లేవు... ప్రయాణాలు సాగవు

రద్దీ సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్‌

సమస్యాత్మకంగా పలు కూడళ్లు

నగర ఇంజినీరింగ్‌ విద్యార్థుల పరిశీలనలో వెల్లడి

రద్దీ సమయాల్లో జగదాంబ కూడలి ఇలా

ఏ రోడ్డయినా, ఏ కూడలి అయినా ప్రమాణాలకు లోబడే ఉండాలి. లేకపోతే అన్నీ సమస్యలే. ఇప్పుడు విశాఖ నగరం ఇలాంటి సమస్యలతోనే సతమతమవుతోంది. ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న కూడళ్లు, వాటి అనుబంధ దారుల వల్ల విపరీతమైన ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నగరంలో మచ్చుకు కొన్ని రద్దీ కూడళ్లను నగరంలోని గాయత్రి విద్యాపరిషత్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు పరిశీలించారు. శాస్త్రీయంగా అక్కడున్న లోపాలపై అధ్యయనం చేశారు. -ఈనాడు, విశాఖపట్నం

నగరంలో చాలా కూడళ్లు, వాటికి అనుబంధ రహదారులు ప్రజలు నడిచేందుకు, వాహనాలు తిరిగేందుకు ఏమాత్రం యోగ్యంగా లేవని వివిధ విభాగాలు కూడా నివేదికలు ఇస్తున్నాయి. కానీ వాటిపై చర్యలు తీసుకోవడంలో, పరిష్కారం వెతికి అమలు చేయడంలో అలసత్వం కనిపిస్తోంది. ఆర్టీఏ అధికారులు చెప్పేదాన్నిబట్టి నగరంలో ద్విచక్రవాహనాలు, కార్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నెలకు సగటున 2400 ద్విచక్ర వాహనాలు, 900 కార్లు నగరంలో రిజిస్ట్రేషన్‌ అవుతున్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లు రోడ్లు, కూడళ్లు సౌకర్యవంతంగా చేయాల్సి ఉంది. కానీ జరగడంలేదు.

*ఎక్కడెక్కడ ఏం తేలింది..: విద్యార్థులు డాబాగార్డెన్స్‌ కూడలి, జగదాంబ కూడలి, రామాటాకీస్‌ కూడలి, అనుబంధ దారుల్ని ఎంచుకుని పరిశోధన చేశారు. అక్కడి లోపాల్నీ పసిగట్టారు. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో భరించలేనంత రద్దీ పెరుగుతోందని తేల్చారు.

*● జగదాంబ కూడలిలో రద్దీ పెరగడానికి షాపింగ్‌ ప్రధాన కారణమని నిర్ధరిస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య కూడా బాగా పెరిగిందని.. వీటివల్ల రాకపోకలు చేసే వాహనాలు విపరీతంగా పెరిగాయని చెబుతున్నారు.

*● జగదాంబ కూడలిలో సినిమాలు వదిలేటప్పుడు విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ఆ సమయంలో వాహనాల వేగం దాదాపుగా పడిపోతుందని వారు గమనించారు. ● రామాటాకీస్‌ కూడలిలోనే బస్‌స్టాప్‌ ఉండటం వల్ల ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే ఆగిపోతోందని చెబుతున్నారు. చుట్టుపక్కల విద్యాసంస్థల నుంచి విద్యార్థులు అక్కడికి వచ్చినప్పుడు సమీపంలోని రెండు కూడళ్లలోనూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ● రామాటాకీస్‌ కూడలిలోనే సినిమా థియేటర్‌ ఉండటమూ ట్రాఫిక్‌కు ఓ కారణంగా చూపిస్తున్నారు.

*ఎక్కడెక్కడ ఏం చేయాలి..: పరిశోధనలో గమనించిన సమస్యలు, వాహనదారుల నుంచి సేకరించిన అభిప్రాయాలకు అనుగుణంగా ఆయా కూడళ్లలో, అనుబంధ రోడ్లలో ఏమేమి చేయాలో పలు సూచనలు చేశారు.

జగదాంబకూడలి, అనుబంధ దారులు: ● రోడ్ల విస్తరణ అవసరం. ఒక్క గ్రీన్‌పార్క్‌ హోటల్‌ రోడ్డు తప్ప మిగిలినవి ఇబ్బందిగా ఉన్నాయి. ● కూడలిలో ఆటోల తాకిడి వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువవుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధానంగా థియేటర్ల నుంచి జనాలు వచ్చేటప్పుడు ఆ సమయంలో ఆటోలన్నీ రావడం వల్ల సమస్య మరీ తీవ్రమవుతోంది. ఈ సమయాల్లో ఆటోల్ని క్రమబద్ధీకరిస్తే ట్రాఫిక్‌ అంతరాయాలు తగ్గుతాయి.

డాబాగార్డెన్స్‌ కూడలి, అనుబంధ రోడ్లు: ● ఈ రోడ్లలో ప్రధానంగా పార్కింగ్‌ సమస్యలున్నాయి. ● సెంట్రల్‌ పార్క్‌కు వెనకవైపు పార్కింగ్‌కు అవకాశం ఇస్తే అనువుగా ఉంటుంది. ● సెంట్రల్‌ పార్క్‌ నుంచి ఆర్‌కే ఫ్యామిలీ రోడ్డుకు ఎఫ్‌వోబీ కడితే జనాలు అటుఇటు తిరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ● ఆర్‌కే ఫ్యామిలీ స్టోర్‌ నుంచి వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌ వైపు రాకపోకలు సాగించే రెండు దారులు విపరీతంగా ట్రాఫిక్‌తో ఉన్నాయి. ఇరుకైన దారులే దీనికి కారణంగా ఉన్నాయి. ఈ దారిలో పార్కింగ్‌ అనేది పెద్ద సమస్యగా ఉంది.

రామాటాకీస్‌ కూడలి: ● జంక్షన్‌కు సమీపంలోనే బస్‌షెల్టర్‌ ఉండటం ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్‌ సమస్యలు రావడానికి ఇది ప్రధాన కారణం. ఈ బస్టాప్‌ను మరో చోటికి మారిస్తే ఉపయోగం ఉంటుంది. కనీసం కూడలికి 100మీటర్ల దూరానికి తీసుకెళ్లాలి.

పరిశీలించిన ప్రాంతాలు: జగదాంబ కూడలి, డాబాగార్డెన్స్‌ కూడలి, రామాటాకీస్‌ కూడలి, వీటి అనుబంధ రోడ్లు

ఒక్క గంటలో ఎన్ని వాహనాలు...: ఎంపిక చేసిన కూడళ్లలో ఒక్కో గంట పాటూ పరిశీలించారు. ఆ సమయంలో ఎన్నెన్ని వాహనాలు ఆ కూడలి మీదుగా వెళ్లాయంటే..

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.