close

ప్రధానాంశాలు

ధోనీ రనౌట్‌పై చెన్నై అభిమానుల ఆగ్రహం..

ముంబయి : ఐపీఎల్‌-2019 సమరం ముగిసింది. విజేతగా ముంబయి నిలిచిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పలు వివాదాస్పద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చెన్నై సారథి ధోని రనౌట్‌ గురించి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. 
హార్దిక్‌ వేసిన 13వ ఓవర్‌ ఉత్కంఠకు దారితీసింది. నాలుగో బంతికి వాట్సన్‌ సింగిల్‌ తీశాడు. మిడ్‌ వికెట్‌లో ఉన్న బౌలర్‌ నాన్‌ స్ట్రైకర్‌ వైపు వికెట్లకు బంతిని త్రో చేశాడు. హార్దిక్‌ బంతిని అందుకోలేదు. ఓవర్‌ త్రో వెళ్లగానే ధోని రెండో పరుగు మొదలుపెట్టాడు. డీప్‌ కవర్స్‌ నుంచి మెరుపులా పరుగెత్తుకుంటూ వచ్చిన ఇషాన్‌ కిషన్‌ నేరుగా వికెట్లను త్రో విసిరాడు. తొలుత ఔటని భావించి ధోని నడక ప్రారంభించగా.. అంపైర్లు వెళ్లొద్దంటూ అతడిని ఆపారు. థర్డ్‌ అంపైర్‌ చాలా సేపటి వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. చివరికి ధోని ఔటయ్యాంటూ ప్రకటించగానే ముంబయి మ్యాచ్‌ గెలిచినంత సంబరాల్లో మునిగి తేలింది. అయితే రీప్లేలో స్పష్టంగా అలా కనిపించకపోవడంతో ఆ సమయంలో బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద థర్డ్‌ అంపైర్‌ బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా వ్యహరించి ఉండాల్సిందని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. 
థర్డ్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌ నిర్ణయంపై సీఎస్కే అభిమానులు మండిపడ్డుతున్నారు. తమ ఆగ్రహాన్ని ట్విటర్ వేదికగా ప్రదర్శిస్తున్నారు.
ధోనీ నిజంగా ఔటా? అంటూ పలువురు ప్రశ్నించగా.. మరోసారి ఐపీఎల్‌లో చెత్త నిర్ణయమని,థర్డ్‌ అంపైర్‌ తన ఖాతాలో డబ్బులు పడేంత వరకూ ఎదురుచూసి.. ఆ తర్వాత ధోనీని ఔట్‌గా ప్రకటించాడని అభిమానులు మండిపడుతున్నారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net