ట్రక్కు బోల్తా.. 10మంది జవాన్లకు గాయాలు
close

తాజా వార్తలు

Published : 31/10/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రక్కు బోల్తా.. 10మంది జవాన్లకు గాయాలు

గిరిధ్‌: ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోడ్డుపై పశువులు అడ్డంగా రావడంతో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం సంభవించింది.

సీఆర్పీఎఫ్‌ 154వ బెటాలియన్‌కు చెందిన 25 మంది జవాన్లను మదుబన్‌ నుంచి నిమియా ఘాట్‌కు తరలిస్తుండగా మదుబన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనానికి పశువుల గుంపు అడ్డుగా రావడంతో వాటిని తప్పించేందుకు డ్రైవర్‌ యత్నించాడు. ఈ క్రమంలో వాహనం బోల్తా పడింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఎయిర్‌లిఫ్ట్‌ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని