తెలంగాణలో కొత్తగా 269 కేసులు
close

తాజా వార్తలు

Published : 17/06/2020 21:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 269 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 269 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ నుంచే 214 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇవాళ మరొకరు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 5,675కి పెరిగింది. మరణాలు సంఖ్య 192కి చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 827 మందికి నెగిటివ్‌ అని తేలింది. ఇప్పటి వరకు 45,911 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు 3071 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 151 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2412 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని