జనగామ: వాగులో కొట్టుకుపోయిన కారు
close

తాజా వార్తలు

Updated : 14/10/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనగామ: వాగులో కొట్టుకుపోయిన కారు

నలుగురిని ఒడ్డుకు చేర్చిన సహాయక సిబ్బంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనగామ జిల్లాలోని హుస్నాబాద్‌- జనగామ రహదారిపై వడ్లకొండ వాగులో వరద నీటి ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రమాదంలో పడ్డారు. అయితే, వాగులో ఓ చెట్టుకు ఢీకొని కారు ఆగిపోవడంతో కారు పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూశారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు, స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చీకటిగా ఉండటంతో వాగు ఉద్ధృతి అంతకంతకు పెరుగుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే, రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది రెండు గంటలకు పైగా శ్రమించి తాడు సాయంతో నలుగురు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న అదనపు కలెక్టర్‌ హమీద్‌, డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని