‘బంగారు బుల్లోడు’గా సంక్రాంతికీ అల్లరి బుల్లోడు
close

తాజా వార్తలు

Updated : 24/12/2020 00:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బంగారు బుల్లోడు’గా సంక్రాంతికీ అల్లరి బుల్లోడు

హైదరాబాద్: కామెడీ చేయటంలో తనదైన ముద్ర వేసుకొని అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు ‘అల్లరి నరేష్‌’. 2019లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబుతో కలిసి ‘మహర్షి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తిరిగి మళ్లీ కథానాయకుడి పాత్రలతో తన కామెడీ ప్రపంచంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బంగారు బుల్లోడు’ చిత్రం జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. 

‘కరోనా కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యమైందన్నారు. తిరిగి మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. థియేటర్లలో చిత్రాలు చూసే లోకానికి తిరుగు ప్రయాణమయ్యాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తాం’ అని అయన చెప్పారు. ఈ చిత్రంలో పూజ ఝవేరీ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే అయన జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన బంగారం ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగిగా చేయనున్నారు. పి.వి. గిరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృథ్వీ రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘నాంది’ చిత్రంలోనూ ఆయన నటించనున్నారు. 
 
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని