16 ఏళ్ల వయసులోనే నాకెన్నో కష్టాలు..: కంగన
close

తాజా వార్తలు

Published : 12/10/2020 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

16 ఏళ్ల వయసులోనే నాకెన్నో కష్టాలు..: కంగన

చిన్నాభిన్నమైన కుటుంబంలో...

ముంబయి: చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ పేర్కొన్నారు. చిన్నాభిన్నమైన కుటుంబానికి చెందిన పిల్లలపై మానసిక ఒత్తిడి ప్రభావం అత్యధికంగా ఉంటుందని పేర్కొన్నారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె తాజాగా ట్వీట్‌ చేశారు. డిప్రెషన్‌ గురించి కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె మాట్లాడిన వీడియోను రీట్వీట్‌ చేశారు.

‘16 ఏళ్ల వయసులో నేను శారీరక వేధింపులు ఎదుర్కొన్నా. యాసిడ్‌ దాడికి గురైన నా సోదరి బాగోగులను ఒక్క దాన్నే చూసుకున్నా. ఈ క్రమంలో మీడియాను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసిక ఒత్తిడికి ఎన్నో కారణాలు ఉంటాయి.. కానీ చిన్నాభిన్నమైన కుటుంబాలకు చెందిన పిల్లలు దానితో పోరాడటం వేరు. సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లలతో పోలిస్తే వీరి పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సంప్రదాయ కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం’ అని కంగన పేర్కొన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ..

అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సోమవారం కంగన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. శివసేన పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ముంబయిలో విద్యుత్తు సరఫరా ఆగింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం క-క-క- కంగన’ అంటోంది అని పరోక్షంగా విమర్శించారు.
సంజయ్‌ రౌత్‌ జేసీబీ బొమ్మను చేతిలో పెట్టుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. వేధింపులకు గురయ్యానని, ఆర్థికంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ఇబ్బందిపడ్డానని తెలిపారు.  ఇప్పుడు (ఫొటో ద్వారా) మహారాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, రాజకీయ అమాయకత్వం ఇలా బహిర్గతం కావడంతో తన బాధలకు ప్రతిఫలం దక్కిందని అన్నారు. ‘నా ఇంటిని అక్రమంగా కూల్చారని నేను చేసిన ఆరోపణలు దీంతో నిరూపితమయ్యాయి’ అని ట్వీట్‌ చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసుపై కొన్ని రోజుల క్రితం స్పందించిన కంగన.. ఆ క్రమంలో ‘ముంబయి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌’లా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో శివసేన పార్టీ నాయకులకు, ఆమెకు మధ్య వివాదం మొదలైంది. ఆపై కంగన ఇల్లు/ఆఫీసు చట్టవిరుద్ధమైన కట్టడం అంటూ బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూల్చివేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని