
తాజా వార్తలు
ఏం చేస్తారో కాదు..ఏం చేశారో చెప్పాలి: జీవీఎల్
తిరుపతి: అభివృద్ధే అజెండాగా తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైకాపా, తెదేపాతో తలపడతామని భాజపా స్పష్టం చేసింది. జనసేనతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తిరుపతిలో తర్వాత ఏం సాధిస్తారో చెప్పడం మానేసి.. ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సాగరమాల పథకం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటులాంటి కేంద్రం నిధులతో తిరుపతిలో చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు. సాగరమాల పథకం కింద దేశవ్యాప్తంగా 91 రోడ్డు ప్రాజెక్టులు చేపడితే వాటిలో 32 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలుపెట్టినట్లు చెప్పారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం 9 రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 83 రైలు ప్రాజెక్టులు కేంద్రం ఆమోదం తెలిపితే.. అందులో 21 ప్రాజెక్టులు ఏపీలోనే ఉన్నాయని జీవీఎల్ స్పష్టం చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
