close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 24/06/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరో 20 రోజులు లాక్‌డౌన్‌ పెట్టండి 

లేకపోతే ‘బెంగళూరు మరో బ్రెజిలే’: కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటకలో తక్షణమే 20 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో లాక్‌డౌన్‌ సడలింపులతో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. మరీ ముఖ్యంగా బెంగళూరులో తక్షణమే లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో నిబంధనలను కఠినతరం చేయకపోతే బెంగళూరు మరో బ్రెజిల్‌ అవుతుందని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్‌-1 తర్వాత దేశంలో కరోనా తీవ్రత అధికమైందని అభిప్రాయపడ్డారు. ప్రజల జీవితాలతో ఆటలాడొద్దన్న ఆయన.. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలను మూసి ఉంచడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. బెంగళూరు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తక్షణమే నగరంలో 20 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు. లేకపోతే బెంగళూరు మరో బ్రెజిల్‌ అవుతుందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల కంటే ఎకానమీ ముఖ్యం కాదన్నారు. 

ప్రస్తుతం కరోనా అత్యధిక కేసులు ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉందన్న కుమారస్వామి.. మన వద్ద జనసాంద్రత ఎక్కువగా ఉండటం కూడా పెద్ద సమస్యేనన్నారు. కరోనా అత్యధికంగా ఉన్న అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు సుమారు 4.4 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 14వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

దేశ వ్యాప్తంగా కూడా 20 రోజుల పాటు లాక్‌డౌన్‌ పెట్టే విషయాన్ని ప్రధాని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల భద్రతకే ప్రాధాన్యమివ్వాలన్నారు. కర్ణాటకలో దినసరి కూలీలు, క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని.. వారికి  కనీసం రూ.5వేలు చొప్పున సాయం అందించాలని కోరారు.  కర్ణాటకలో ఇప్పటివరకు 9వేలకు పైగా  పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. వీరిలో 142మంది ప్రాణాలు కోల్పోయారు. 

మాజీ సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్‌ నారాయణ్‌ స్పందించారు. కుమారస్వామి ఇచ్చిన సూచనలు ఆహ్వానించిన ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారని తాను అనుకోవడం లేదన్నారు. ఇప్పటికే కరోనా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలు చేపట్టామని అన్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.