కేటీఆర్‌ అలా మాట్లాడితే ఊరుకోం:లక్ష్మణ్‌
close

తాజా వార్తలు

Updated : 28/01/2020 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేటీఆర్‌ అలా మాట్లాడితే ఊరుకోం:లక్ష్మణ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ విచక్షణ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో కలిసి 2020 దైనందిని ఆవిష్కరించిన అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. అక్రమాలు చేస్తూ ఆదర్శాలు వల్లించడం కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌కే చెల్లుతుందని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుల రూపకల్పన, రిజర్వేషన్లతో పాటు అనేక అంశాల్లో తెరాస అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రలోభాలు, అవినీతితో జరిగిన ఎన్నికలు కూడా ఓ ఎన్నికలేనా.. ఇది ఓ గెలుపేనా.. అని లక్ష్మణ్‌ ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడే తీరుపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీతో తెలంగాణలో ఎలా ఓటు వేయిస్తారని లక్ష్మణ్‌ నిలదీశారు. విలువలతో కూడిన రాజకీయాలంటే ఇలానే ఉంటాయా? అని లక్ష్మణ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని