‘తబ్లిగ్‌’తో వేగంగా కేసులు డబుల్‌: కేంద్రం
close

తాజా వార్తలు

Published : 05/04/2020 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తబ్లిగ్‌’తో వేగంగా కేసులు డబుల్‌: కేంద్రం

దిల్లీ: దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం కారణంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేవలం 4.1 రోజుల్లోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పేర్కొంది. అదే జరగకపోయి ఉండుంటే కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి 7.4 రోజుల సమయం పట్టేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖలతో కలిసి ఆదివారం సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

శనివారం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 472 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 11 మరణాలు సంభవించాయని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 79కి చేరిందన్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,374కు చేరిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 267 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారని తెలిపారు. దేశం మొత్తమ్మీద 274 జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 27,661 రిలీఫ్‌ క్యాంప్‌లు ఏర్పాటయ్యాయని హోంశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇవి ఏర్పాటు చేశామని తెలిపింది. 19,460 ఫుడ్‌ క్యాంప్స్‌ ఏర్పాటు చేసి, 75 లక్షల మందికి నిత్యం ఆహారం అందిస్తున్నామని పేర్కొంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని