పట్టాభికి పార్టీ అండగా ఉంటుంది: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 04/10/2020 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్టాభికి పార్టీ అండగా ఉంటుంది: చంద్రబాబు

విజయవాడ: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఫోన్లో పరామర్శించారు. కారు ధ్వంసం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. జరిగిన ఘటనను చూస్తుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామనిపిస్తోందని లోకేశ్‌ మండిపడ్డారు. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వెల్లిబుచ్చారు. నిన్న సబ్బం హరి నివాసంపై, ఇవాళ పట్టాభి కారుపై దాడి సిగ్గు చేటన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని లోకేశ్‌ నిలదీశారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ సైతం పట్టాభికి ఫోన్‌ చేసి దాడి వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పట్టాభి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అద్దాలు పగులగొట్టిన విషయం తెలిసిందే. వైకాపా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడారని పట్టాభి ఆరోపిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని