close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/05/2020 08:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా పరీక్షలో ఒక్కో రోజు ఒక్కోలా ఫలితం

వాషింగ్టన్‌: కరోనా నిర్ధారణకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది నిపుణులు ఆశ్రయిస్తున్న ‘రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్టేజ్‌ పాలిమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌)’ పరీక్ష అన్నివేళలా కచ్చితమైన ఫలితాలనిస్తుందన్న భరోసా లేదని తాజా అధ్యయనమొకటి తేల్చింది. వ్యక్తుల్లో వైరస్‌ ప్రవేశించిన తర్వాత, ఏ రోజు పరీక్ష చేస్తున్నామనేదాన్నిబట్టి ఫలితంలో మార్పులు ఉంటున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. వైరస్‌ సోకినప్పటికీ దాని ఉనికిని ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్ధారించలేని కేసులు 20% కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా వైరస్‌ బారిన పడ్డ తర్వాత పరీక్ష నిర్వహించే సమయాన్ని బట్టి కచ్చితత్వం మారుతోంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైన రోజు వైరస్‌ ఉనికిని ఈ పరీక్ష ఏమాత్రం గుర్తించడం లేదు. వైరస్‌ సోకిన తర్వాత నాలుగో రోజు కూడా ‘నెగిటివ్‌’ అని వచ్చే అవకాశం 67% ఉంటోంది. అలాంటి తప్పు ఫలితం వచ్చే ముప్పు 8వ రోజు నాటికి 20 శాతానికి తగ్గుతోంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తిలో వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలయ్యాక కూడా ‘నెగిటివ్‌’ అని పరీక్షలో తేలే అవకాశం 38% ఉంటోంది. ఇక 9వ రోజు నుంచి 21వ రోజు వరకు పరీక్ష చేస్తూ పోతే.. వైరస్‌ లేదని ఫలితం వచ్చే శాతం 21 శాతం నుంచి 66 శాతానికి పెరుగుతూ పోతోంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.