close

తాజా వార్తలు

అలా చేయకపోతే నా చెవులు మెలిపెట్టండి

దిల్లీ: హస్తినలో ఎన్నికల ప్రచార జోరు వాడీవేడిగా జరుగుతోంది. కేంద్రహోం మంత్రి అమిత్‌షా భాజపా తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ దఫా భాజపాకు ప్రజలు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. దేశరాజధాని దిల్లీని ప్రపంచస్థాయి నగరంగా చేయకపోతే తన చెవులు మెలిపెట్టిమరీ అడగమని అమిత్‌షా అన్నారు. బాబర్‌పూర్‌ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

‘కాంగ్రెస్‌కు 15ఏళ్లు అధికారంలో ఉండే అవకాశం ఇచ్చారు. ఆప్‌కు ఐదేళ్ల అవకాశం ఇచ్చారు. ఈ దఫా మీరు మాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. మేం అధికారంలోకి రాగానే దిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దుతాము. అలా చేయకపోతే మీరు నా దగ్గరకు వచ్చిన నా చెవులు మెలిపెట్టండి’ అని ఆయన అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆప్‌పై విమర్శల దాడికి దిగారు. పేదల కోసం ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తే దాన్ని సీఎం కేజ్రీవాల్‌ అమలు చేయడకుండా దిల్లీ వాసులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ‘దిల్లీలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్‌ ఖర్చులు చెల్లించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొంతమంది ఖర్చులు భరించలేక అనారోగ్యంతో కాలం గడుపుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధాని మోదీ పేదల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. కానీ దాని ప్రయోజనాలను దిల్లీ వాసులు పొందడానికి వీల్లేకుండా కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ను దిల్లీలో అమలు చేసేందుకు సీఎం నిరాకరించారు’ అని ఆయన ఆరోపించారు. కొన్ని సర్వేల ప్రకారం ఒక ప్రభుత్వం మంచి నీటిని సరఫరా చేయడంలో అగ్రస్థానంలో ఉంది. మరొకరు రహదారుల నిర్మాణంలో ఇంకొకరు విద్యుత్‌ సరఫరాలో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ కేజ్రీవాల్‌ ప్రభుత్వం మాత్రం అబద్ధాలు చెప్పే విషయంలో మొదటి స్థానంలో ఉంది’ అని ఆయన మండిపడ్డారు.

హస్తినలో ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆప్‌, భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. మరోసారి పీఠాన్ని దక్కించుకోవాలని ఆప్‌ చూస్తుండగా.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే అయా పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తూ ఒకరిపై మరొకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.