పాక్‌ నుంచి ఎన్ని నిధులు అందాయి?ఎవరిచ్చారు?

తాజా వార్తలు

Updated : 16/12/2020 11:32 IST

పాక్‌ నుంచి ఎన్ని నిధులు అందాయి?ఎవరిచ్చారు?

పీఎం కేర్స్‌ నిర్వహణపై కేంద్రానికి కాంగ్రెస్‌ సూటి ప్రశ్న

దిల్లీ: కరోనాపై పోరు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్‌ ఫండ్‌’ నిర్వహణపై కాంగ్రెస్‌ పార్టీ పలు ప్రశ్నలు సంధించింది. విరాళాలు వస్తున్న తీరుపైనా అనేక అనుమానాలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ప్రధానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘పాకిస్థాన్‌, చైనా, ఖతార్‌ వంటి దేశాల నుంచి కూడా పీఎం కేర్స్‌కు విరాళాలు రావడం ఆశ్చర్యకరమైన అంశం. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను. 1. పీఎం కేర్స్‌ నిధుల కోసం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ప్రచారం చేసి విరాళాలు ఎందుకు స్వీకరించాయి?; 2. చైనాకు చెందిన నిషేధిత యాప్‌లలో నిధుల సేకరణకు సంబంధించిన ప్రకటనలు ఎందుకు ఇచ్చారు?; 3. పాకిస్థాన్‌ నుంచి ఎన్ని నిధులు వచ్చాయి? అవి ఎవరిచ్చారు?; 4. భారీగా విరాళాలిస్తున్న ఖతార్‌లోని ఆ రెండు పెద్ద కంపెనీలేవి?అవి ఇప్పటి వరకు ఎన్ని నిధులిచ్చాయి’’ అని సూర్జేవాలా ట్విటర్‌ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు.

అలాగే, ఇప్పటి వరకు 27 దేశాల నుంచి అందిన నిధులెన్నని సుర్జేవాలా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎన్‌ఐఎస్‌ఎస్‌ఈఐ ఏఎస్‌బీ కంపెనీ నుంచి విరాళాలు అందడం.. తద్వారా భారత్‌లో ఆ సంస్థ తమ కర్మాగారాన్ని ప్రారంభించుకునేలా క్విడ్‌ ప్రోకో ఏమైనా జరిగిందా అని నిలదీశారు. ఇక నిధులు అందిన 27 దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు పీఎం కేర్స్‌ గురించి రహస్యంగా ఎందుకు ప్రచారం చేస్తున్నాయని ప్రశ్నించారు. అలాగే ఎఫ్‌సీఆర్‌ఏ చట్ట పరిధి నుంచి పీఎం కేర్స్‌ నిధులకు ఎందుకు మినహాయింపునిచ్చారని అడిగారు. భారత్‌లో ఏ దాతృత్వ సంస్థకు లేని ప్రత్యేక వెసులుబాటు పీఎం కేర్స్‌కు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు.

ఇవీ చదవండి..
ప్రధాని మోదీ విరాళాల మొత్తం ఎంతో తెలుసా?

ఉచిత టీకా దిశగా బిహార్‌ ముందడుగు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని