మ్యూజియంగా ‘మారడోనా సూట్‌ రూం’
close

తాజా వార్తలు

Updated : 29/11/2020 23:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యూజియంగా ‘మారడోనా సూట్‌ రూం’

ఏర్పాటు చేసిన బ్లూ నైల్‌ హోటల్‌ నిర్వాహకులు

ఇంటర్నెట్‌డెస్క్‌: డీగో మారడోనా అంటే తెలియని ఫుట్‌బాల్‌ క్రీడాభిమానులు ఉండరు. అర్జెంటీనా స్టార్‌ మారడోనాకు భారత్‌లోనూ భారీ సంఖ్యలో అభిమానులున్నారు. నవంబర్ 25న డీగో మారడోనా (60) తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.  పలు సందర్భాల్లో మారడోనా భారత్‌కు విచ్చేశారు. 2012లో కేరళకు వచ్చినప్పుడు కాన్నూర్‌లోని బ్లూ నైల్‌ హోటల్ రూమ్‌ నెంబర్‌ 309లో బస చేశారు. అప్పటి నుంచి దానిని ‘మారడోనా సూట్‌’గా పిలుస్తున్నారు. డీగో మారడోనా మరణంతో హోటల్‌ యజమాని ఫుట్‌బాల్‌ లెజెండ్‌ జ్ఞాపకార్థం ఆ గదిని మ్యూజియంగా మార్చి అంకితం చేశారు. ‘మారడోనా సూట్‌’లో డీగో చిత్రం పటం ఉంటుంది. పర్యటన సందర్భంగా వినియోగించిన వస్తువులు, దిగిన ఫొటోలు, అప్పుడు వచ్చిన వార్తా పత్రికల కథనాలు, ఫుట్‌బాల్‌ బంతులను అక్కడ ఉంచారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని